మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ గత ఏడాది విడుదలై 100 కోట్ల వసూళ్లతో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఈసినిమాను తెలుగు లోకి కూడా డబ్ చేసి విడుదలచేశారు కానీ మనోళ్లు పట్టించుకోలేదు. స్టార్ హీరో  పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం అంతేకాదు ఆయన ఈసినిమాలో ఓ కీలక పాత్రలో మెరిశాడు. ఇక ఈ సినిమా ను తెలుగులో రీమేక్ చేయనున్నారని తెలిసిందే. రామ్ చరణ్రీమేక్ హక్కులను దక్కించుకోగా మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించనున్నాడు. ఈ రీమేక్ కు దర్శకుడిని కూడా ఫిక్స్ చేశారు. 
 
సాహో తో నిరాశపరిచిన కూడా యంగ్ డైరెక్టర్ సుజీత్ ను ఈ సినిమాకు దర్శకుడిగా తీసుకున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అన్ని కుదిరితే  ఈ ఏడాది చివర్లో ఈసినిమా  సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక మోహన్ లాల్ పాత్రను చిరంజీవి చేయనుండగా పృథ్వీరాజ్ పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను తీసుకొనేందుకు రామ్ చరణ్ ఆసక్తిని చూపిస్తున్నాడట. చరణ్ తో సల్మాన్ కు మంచి అనుబంధం వుంది అంతేకాకుండా ఒకవేళ సల్మాన్ ఒప్పుకుంటే  ఈసినిమాను నార్త్ లో కూడా విడుదలచేయవచ్చని భావిస్తున్నారట అయితే ఇప్పటివరకు మాత్రం సల్మాన్  ఫైనలైజ్ కాకపోయినా అతను నటించే అవకాశాలు లేకపోలేదని  ఫిలిం నగర్ టాక్. త్వరలోనే ఈవిషయంలో ఓ క్లారిటీ రానుంది. 
 
ఇక చిరు ప్రస్తుతం ఆచార్య లో నటిస్తున్నాడు.  బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటించనుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై  నిరంజన్ రెడ్డి , రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: