యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమా శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు పోటీగా మరో రెండు సినిమాలు సైతం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. దీంతో పాటు శ్రీకారం సినిమా పాత చింత కాయ‌ప‌చ్చ‌డి అని కూడా విమ‌ర్శ‌కులు తేల్చేశారు. ఇప్ప‌టి రోజుల్లో వ్య‌వసాయం క‌థతో సినిమాలు తీస్తే ఎవ‌రు చూస్తార‌ని కూడా విమ‌ర్శ‌లు చేశారు. అయితే తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్‌తో సంబంధం లేకుండా వ‌సూళ్లు వ‌చ్చాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీకారం సినిమాకు తొలి రోజు రు. 3 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. మిక్స్ డ్ టాక్‌తో కూడా ఈ రేంజ్‌లో వ‌సూళ్లు వ‌చ్చాయంటే శ‌ర్వానంద్ క్రేజ్ ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది. పైగా జాను లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత శ‌ర్వా ఈ సినిమా చేసినా కూడా ప్రి రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాతో కిషోర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది.

ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌రికి ఇదే ర‌న్ కంటిన్యూ అయితే ఫ‌స్ట్ వీకెండ్ కే శ్రీకారం బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. ఏరియాల వారీగా తొలి రోజు వ‌సూళ్లు చూస్తే నైజాంలో రూ. 1.10 కోట్లు - సీడెడ్ లో రూ. 75 లక్షలు - ఉత్తరాంధ్ర లో 54 లక్షలు - కృష్ణా లో 25 లక్షలు - గుంటూరులో 65 లక్షలు - ఈస్ట్ గోదావ‌రిలో 30 లక్షలు - వెస్ట్ లో 28 లక్షలు - నెల్లూరులో 14 లక్షలు షేర్ వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: