2007 వ సంవత్సరం లో హ్యాపీడేస్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిఖిల్. ఆ సినిమాలో తెలంగాణ కుర్రాడిగా నిఖిల్ చేసిన అద్భుతమైన నటనకు గాను ఆయనకు మంచి పాపులారిటీ ఏర్పడగా ఆ పాపులారిటీ తోనే మరిన్ని సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. ఆ సినిమాలో నటించిన ఇతర హీరోలు ఇప్పుడు కనుమరుగై పోయినా నిఖిల్ ఒక్కొక్క సినిమాను హిట్ చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకున్నారు. హ్యాపీ డేస్ తర్వాత ఆయన చేసిన రెండవ సినిమా యువత కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆయనకు హీరోగా మరిన్ని ఛాన్స్ లు వచ్చాయి.

తొలుత హైదరాబాద్ నవాబ్స్ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి వేరే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసి హ్యాపీ డేస్ లో మంచి అవకాశాన్ని పొందాడు నిఖిల్. అయితే కొన్ని తప్పుడు నిర్ణయాలు ఆయన కెరియర్ పై చాలా ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఆయన చేసిన కొన్ని రీమేక్ సినిమాలు ఒక్కటి కూడా హిట్ కాకపోగా ఆయనకున్న ఇమేజ్ ను చాలా తగ్గించాయి. అలా ఆయన చేసిన రీమేక్ సినిమాలు ఏంటి? అవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి? నిఖిల్ కెరియర్ కు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

నిఖిల్ నటించిన తొలి రీమేక్ చిత్రం సూర్య వర్సెస్ సూర్య.  ఓ జపనీస్ సినిమా కథకు సిమిలర్ గా ఉండే ఈ సినిమా ఫ్లాప్ అయ్యి నిఖిల్ కెరీర్ ని చాలా ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఆయన ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన శంకరాభరణం సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా 2010లో హిందీలో విడుదలైన పాస్ గయే రే ఒబామా అనే సినిమాకి రీమేక్. అంజలి ప్రధాన పాత్రలో నటించగా నందిత రాజ్ హీరోయిన్ గా నటించింది. కోన వెంకట్ రచించిన ఈ సినిమా నిఖిల్ కెరీర్ లో మినిమం సినిమా గా కూడా నిలబడలేకపోయింది.

నిఖిల్ కన్నడ నుంచి ఏరికోరి మరీ చేసిన సినిమా కిరాక్ పార్టీ. కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయి చరిత్ర సృష్టించిన ఈ సినిమా తెలుగులో కూడా అదేవిధంగా హిట్ అవుతుందని అనుకున్నారు. నిఖిల్ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ సినిమా అత్యంత దారుణంగా అపజయాన్ని పొందిది. అలాగే ఆయన నటించిన అర్జున్ సురవరం అనే సినిమా కూడా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి రీమేక్ చేయబడిన సినిమానే. ఈ సినిమా కూడా నిఖిల్ ని మోసం చేసింది. ఇలా ఆయన డైరెక్ట్ గా చేసిన సినిమాలు హిట్ అయ్యాయి కానీ రీమేక్ చేసిన సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం కార్తికేయ సీక్వెల్లో మరియు సుకుమార్ రైటింగ్స్ లోని 18 పేజెస్ సినిమాల్లో చేస్తున్నాడు నిఖిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: