తెలుగు సినిమా పరిశ్రమకు ప్రశాంత్ హీరోగా తెరకెక్కిన లాఠీ మూవీ ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన గుణశేఖర్, ఆ తరువాత సొగసు చూడ తరమా, బాల రామాయణం చిత్రాలు తెరకెక్కించి మంచి పేరు దక్కించుకున్నారు. అయితే అనంతరం మెగాస్టార్ చిరంజీవి, సౌందర్య, అంజలా ఝవేరి ల కలయికలో తాను తెరకెక్కించిన చూడాలని ఉంది మూవీ భారీ బ్లాక్ బస్టర్ ద్వారా కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అందుకున్న గుణశేఖర్, ఆపై జగపతి బాబు తో మనోహరం, అలానే మరొక్కసారి మెగాస్టార్ తో మృగరాజు సినిమాలు తీశారు. ఇక ఈ సినిమా సినిమాల తరువాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో తొలిసారిగా గుణశేఖర్ తీసిన సినిమా ఒక్కడు.

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద సంచలన విజయాన్ని అందుకుంది. దానితో మహేష్, గుణశేఖర్ ల కాంబో పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ అత్యద్భుత నటన, భూమిక అందం, అభినయం, మణిశర్మ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్, చార్మినార్ సెట్, గుణశేఖర్ అత్యద్భుత దర్శకత్వ ప్రతిభ, నిర్మాత ఎమ్ ఎస్ రాజు భారీ నిర్మాణ విలువలు వెరసి ఒక్కడు మూవీ ని అంత పెద్ద విజయంగా మలిచాయి. ఇక ఆ తరువాత మరొక్కసారి మహేష్ తో గుణశేఖర్ చేసిన సినిమా అర్జున్. అక్క, తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కం ఎమోషనల్ డ్రామా మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎబోవ్ యావరేజ్ విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా కోసం వేసిన భారీ మధుర మీనాక్షి అమ్మవారి కోవెల సెట్ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఆపై మరికొన్నాళ్లు గ్యాప్ అనంతరం మహేష్ తో మరొక్కసారి గుణశేఖర్ తెరకెక్కించిన మూవీ సైనికుడు. వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ విలన్ పాత్ర చేసారు. అయితే ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినప్పటికీ ఈ సినిమాలో కంపోజ్ చేయబడ్డ భారీ విజువల్ ఎఫెక్ట్స్, హరీష్ జయరాజ్ అందించిన సాంగ్స్, మహేష్ బాబు నటనకు అందరి నుండి మంచి పేరు దక్కింది. ఆ విధంగా మహేష్, గుణశేఖర్ ల కాంబోకు ప్రేక్షకాభిమానుల్లో మంచి క్రేజ్ దక్కింది ..... !!  

మరింత సమాచారం తెలుసుకోండి: