మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మగధీర. అంతకముందు చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన రామ్ చరణ్, ఆ మూవీతో మంచి సక్సెస్ కొట్టారు. అనంతరం వచ్చిన మగధీర మూవీ అతి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి హీరోగా చరణ్ కి అలానే దర్శకుడిగా రాజమౌళి కి పెద్ద బ్రేక్ ని అందించింది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాలభైరవ, హర్ష అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. గత జన్మలో విడిపోయి చనిపోయిన ప్రేమికులు మళ్ళి 400 ఏళ్ళ తరువాత పుట్టి ఎలా తమ ప్రేమను సఫలం చేసుకున్నారు అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా తీశారు. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కీరవాణి అందించిన సాంగ్స్, బీజీఎమ్ అదిరిపోయాయి. రాజమౌళి గొప్ప టేకింగ్, గ్రాండియర్ విజువల్స్, భారీ సెట్స్ మగధీర మూవీ కి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.
ముఖ్యంగా హీరో రామ్ చరణ్ రెండు పాత్రల్లోనూ ఎంతో ఒదిగిపోయి యాక్ట్ చేసారు. కాలభైరవ పాత్రలో ఆయన పలికిన డైలాగ్స్, యాక్షన్, ఫైట్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. విశేషం ఏమిటంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానామొగుడు మూవీలోని బంగారు కోడిపెట్ట సాంగ్ ని రీమిక్స్ చేయడంతో పాటు ఆ సాంగ్ చివరలో మెగాస్టార్ కొన్ని క్షణాలు కనిపిస్తారు. ఇక ఈ సినిమాలోని హర్ష పాత్ర కోసం చరణ్ ప్రత్యేకంగా బైక్ రేసింగ్ లో శిక్షణ తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక విడుదల తరువాత ఈ సినిమా భారీ కలెక్షన్ రాబట్టడంతో పాటు అనేక ప్రాంతాల్లో సరికొత్త రికార్డ్స్ నెలకొల్పింది ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: