టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు ట్రెండ్ మొదలైన తర్వాత ఎన్నో ఆసక్తికరమైన మల్టీ స్టారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలా ఎన్నో సినిమా లు హిట్లుగా మిగలగా కొన్ని ప్రేక్షకులను ఎంతగానో మంచి కాన్సెప్ట్ లతో అలరించాయి. టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఈ ట్రెండ్ కొనసాగుతూ వచ్చిన కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కంటే ముందు కొన్ని సంవత్సరాలు టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు తెరకెక్కలేదనే చెప్పాలి. ఎప్పుడైతే మహేష్ బాబు వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వచ్చింది. అప్పటి నుంచి మల్టీస్టారర్ సినిమాలు చేయడం ఎక్కువయ్యాయి.

ఆ విధంగా అక్కినేని నాగార్జున నాచురల్ స్టార్ నాని కలిసి నటించిన సినిమా దేవదాసు సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మాతగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018 సెప్టెంబర్ 27న విడుదల మంచి విజయాన్ని అందుకుంది. రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ కావడం విశేషం. ప్రాణాలు తీసే మాఫియా డాన్ మరియు ప్రాణాలు పోసే డాక్టర్ మధ్య ఉన్న అనుబంధమే ఈ సినిమా కథ. 

తెలుగు ప్రేక్షకులకు ప్రాణం యొక్క విలువను తెలియజేసిన సినిమా ఇది అని చెప్పవచ్చు. పదేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న మాఫియాడాన్ దేవా తనను ఆదరించి పెంచిన దాదా ను ప్రత్యర్థులు చంపేయడం తో బయటకు వస్తాడు. దేవా వస్తాడు అన్న విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని పట్టుకోవాలని అన్వేషణ ప్రారంభిస్తారు. దీంతో పాటు తాను చంపాలనుకున్న డేవిడ్ గంగ్ కూడా దేవ నీ చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఓ పోలీస్ దాడిలో గాయపడిన దేవా కి డాక్టర్ దాస్ చికిత్స చేస్తాడు. తన గురించి తెలిసిన కూడా పోలీసులకు చెప్పడు దాస్. దాస్ మంచితనం చూసి అతనితో స్నేహం చేస్తాడు దేవా. మొదట్లో కాస్త ఇబ్బంది పడిన ఆ తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులు గా మారిపోయారు. వీరిద్దరి మధ్య స్నేహం ఎలా కొనసాగింది. పోలీసుల నుంచి డేవిడ్ గ్యాంగ్ నుంచి దేవ్ ఎలా తప్పించుకున్నాడు. తన పగ తీర్చుకున్నాడా అనేదే ఈ సినిమా కథ. 

మరింత సమాచారం తెలుసుకోండి: