సమంత కమర్షియల్ చిత్రాలను తగ్గించిన తర్వాత  లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయడం ప్రారంభించింది.  ఆ నేపథ్యంలోనే కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సమంత 2019లో ఓ బేబీ అనే ఓ అద్భుతమైన కథ కథనాలతో ఉన్న చిత్రాన్ని చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.  సోషియో ఫాంటసీ కామెడీ సినిమా గా వచ్చిన ఈ చిత్రం 2014 లో తెరకెక్కిన కొరియన్ సినిమా మిస్ గ్రానీ కి ఈ సినిమా తెలుగు రీమేక్. ఈ చిత్రంలో సమంత మరియు లక్ష్మి ప్రధాన పాత్ర లో నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో నాగశౌర్య మరియు రాజేంద్ర ప్రసాద్ నటించారు.

చిన్న తనం నుంచే తన తన కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఇంత దూరం జీవితాన్ని నెట్టుకొస్తోంది ఓ ముసలావిడ. కానీ ఆమెకు తన యుక్త వయసులో ఉన్న సమయంలో మిగిలిపోయిన కోరికలను తీర్చు కోవాలని భావిస్తుంది. కానీ నీ కాలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం అంటూ తన జీవితాన్ని భారంగా గడుపుతూ ఉంటుంది.  ఈ క్రమంలోనే ఆ ముసలావిడ ఒక ఫోటో స్టూడియో లో ఫోటో తీయించుకుంటుంది.  అక్కడ అనుకోకుండా ఈమె పాతికేళ్ల యువతి గా మారిపోతుంది.

 ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేదే ఈ ఓ బేబీ కథ. సమంత పాతికేళ్ల యువతి పాత్రలో కనిపిస్తుంది. ఇప్పటికే ఆమెలో నీ నటన చూసిన మన ప్రేక్షకులు ఈ చిత్రంలో సరికొత్త గా ఆమె చేసిన నటన ను చూసి ఆమెను ఎంతగానో ఇష్టపడ్డారు.నటి లక్ష్మి బామ్మ గా అద్భుతంగా నటించింది.  అతిథి పాత్రలో జగపతి బాబు నాగచైతన్య అడవి శేష్ వంటివారు కనిపించి సినిమా హిట్ అవ్వడానికి ఎంతగానో హెల్ప్ చేశారు. 2019 లో భారీ వసూళ్లు రాబట్టిన సినిమా ఇది అని చెప్పవచ్చు. ఇక సమంత కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీ.  ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ మంచి సంగీతాన్ని అందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: