సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ లు, ఎఫైర్లు, బ్రేకప్ లు చాలా కామన్. ఇప్పటికే ఎందరో స్టార్ హీరో హీరోయిన్ లు ఇలా లవ్ చేసుకుని బ్రేకప్ చెప్పేసుకున్న వారు ఉన్నారు. అలాగే ప్రేమ పెళ్లిల్లు చేసుకుని ఆ తరువాత విడాకులు ఇచ్చేసిన వారు ఉన్నారు. కొందరు అయితే మరీ తెగ్గించేసి పెళ్లికి ముందే మ్యాటర్ ఫినిష్ ఘనులు ఉన్నారు. అలా పెళ్లి కాకుండానే తల్లి అయిన స్టార్ హీరోయిన్ లు ఎవరు.. వాళ్లని తల్లిని చేసిన ఆ నటులు ఎవరు అనే విషయం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం రండి..!!

అమీ జాక్సన్: అమీ జాక్సన్ ఈ అందాల  తార గురించి ఎంత చెప్పిన అది తక్కువగానే కనిపిస్తుంది. తన అందంతో ఎక్స్ పోజింగ్ తో కుర్రకారు మతిపోగొట్టేస్తుంది ఈ హాట్  బ్యూటీ. ఇక  ఈ బ్రిటీష్ భామ పెళ్లికి ముందే తల్లి అయ్యింది. జార్జ్ పనయిటౌ అనే బిజినెస్ మ్యాన్ ను లవ్ చేసిన ఈమె  చాలా కాలంగా ప్రేమ మత్తు ని ఎంజాయ్ చేసి... పెళ్లికి ముందే  గర్భవతి అయింది.

శ్రీదేవి: అతిలోక సుందరి శ్రీదేవి.. ఈమె గురించి అందరికి తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని పెళ్లి చేసుకున్న ఈమె కూడా  పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. బోనీ కపూర్‌తో కొన్నాళ్ల గుట్టు చప్పుడు కాకుండా డేటింగ్ చేసిన ఈమె కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగానే ప్రెగ్నెంట్ అయ్యింది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే పెళ్లి జ‌రిగే స‌మ‌యానికి శ్రీదేవికి  ఏడు నెల‌ల కడుపు ఉంది. అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చకే దారి తీసింది.

రేణు దేశాయ్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి  తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెళ్లిల మ్యాటర్ ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది.  ఇష్టపడి పెళ్లిచేసుకున్న మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న ఈయన ఆ తర్వాత రేణు దేశాయ్ తో డేటింగ్ చేశారు. ఇక దాని ఫలితంగా వీరిద్దరికీ 2004 లో అకీరా జన్మించాదు. ఇక అప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇలా రేణు దేశాయ్ కూడా పెళ్లికి ముందే తల్లైంది.

సారికా: - ఈమె యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో లవ్ లో ఉన్నప్పుడు అతడి కారణంగా గర్భవతి అయింది. కానీ అప్పటికే కమల్ హాసన్ కి పెళ్లి అయిపోయింది. అయినప్పటికీ ప్రెగ్నెంట్ విషయం తెలియగానే వెంటనే కమల్ హాసన్ తన భార్యకి విడాకులిచ్చి సారికాని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకి పుట్టిన పాపనే శృతి హాసన్.

కాగా ఈ హీరోయిన్ లు  మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది సినీ తారాలు పెళ్లికి ముందే తల్లి  అయ్యారు. వాళ్లల్లో కొందరు హీరోయిన్స్ గర్భవతులు అయ్యారు అన్న విషయాన్ని తెలుసుకుని పెళ్లిలు చేసుకుంటే మరికొందరు గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకున్నట్లు వార్తలు  వినిపించాయి. ఏది ఏమైనా వీళ్లు తమ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పుచేశారు అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: