సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో రకం సినిమాలను ప్రేక్షకులు ఇష్ట పడుతూ ఉంటారు,  ఆ తరహా కథలతో ముందుకు వచ్చిన దర్శకులకు,  హీరో లకు మంచి విజయాలు బాక్స్ ఆఫీస్ దక్కుతూ ఉంటాయి,  అయితే కొన్ని సందర్భాల్లో పాత రకం కథలకు ఈ జెనరేషన్ కు తగట్టు  మార్పులు చేర్పులు చేసి సినిమాలను తెరకెక్కించిన కూడా ఆ సినిమాలు  మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశాలు ఉంటాయి,  అయితే ఈ నమ్మకం తోనే కొంత మంది దర్శకులు పాత కథలను కొత్త జనరేషన్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సినిమాలను తెరకెక్కిస్తు ఉంటారు,  అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరో లు అయిన మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ఇది వరకు తాము బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఫార్ములా కథలతో తెరకెక్కబోయే సినిమాల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

 అసలు విషయంలోకి వెళితే... మెగాస్టార్ చిరంజీవి ఒకానొక సమయంలో గ్యాంగ్ లీడర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు,  అయితే ఇలా తనకు అదిరిపోయే విజయాన్ని అందించిన గ్యాంగ్ లీడర్ తరహా కథ తో తెరకెక్కబోయే సినిమాలో చిరంజీవి నటించబోతున్నట్లు తెలుస్తోంది, గ్యాంగ్ లీడర్ తరహా కథను చిరంజీవి కోసం వెంకీ కుడుముల తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే నందమూరి నట సింహం బాలకృష్ణ సమరసింహా రెడ్డి,  నరసింహ నాయుడు లాంటి ఫ్యాక్షన్ సినిమాలతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు,  అయితే ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమా లో మరో సారి ఫ్యాక్షన్ లీడర్ గా బాలకృష్ణ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది,  ఇలా ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమకు మంచి విజయాలను ఇచ్చిన ఫార్ములా సినిమాల్లో మరో సారి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: