
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా కాంతార 1 రికార్డులు తిరగరాస్తోంది. ముఖ్యంగా యూఎస్‌లో ఈ సినిమాకు అద్భుతమైన రిస్పాన్స్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు సాధించింది. ఇందులో 60 శాతం పైగా వసూళ్లు తెలుగు వెర్షన్ నుంచే వచ్చాయి. అంటే మిగతా 40 శాతం మాత్రమే కన్నడ, హిందీ, తమిళం, మలయాళ భాషల కలయికగా ఉంది. ఈ లెక్కల ప్రకారం తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు ఎంతగా సపోర్ట్ అందిస్తున్నారో స్పష్టమవుతోంది.
గతంలో కూడా కాంతార మొదటి భాగానికి మన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అద్భుతమైన స్పందన చూపించారు. ఇప్పుడు అదే మళ్లీ రిపీట్ అవుతుండటం విశేషం. రిషబ్ శెట్టి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటన, అజనీశ్ లోకనాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కో సినిమాకు ప్రత్యేకమైన హైలైట్ అయ్యాయి. పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల మద్దతుతో కాంతార 1 ఇప్పటికే మౌత్ టాక్‌లో హిట్ టాక్ సంపాదించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయి థియేట్రికల్ రన్‌ను కొనసాగిస్తోన్న ఈ సినిమా యూఎస్‌లో కూడా తెలుగు వసూళ్ల ఆధిక్యంతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు