ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ అంచనాలతో విడుదలైన సినిమా  భీమ్లా నాయక్, ఈ సినిమా ఆ అంచనాలకు తగినట్టుగా ప్రేక్షకుల నుండి అదిరిపోయే టాక్ ను సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్ లను రాబడుతోంది. భీమ్లా నాయక్ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుండే మంచి అంచనాలు కలిగి ఉన్నాయి,  దానికి ప్రధాన కారణం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు రానా హీరోలుగా నటించడం,  అలాగే ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనున్ కొషియన్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కడం, ఇలా ఎన్నో అంశాలు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరగడానికి దోహదపడ్డాయి.

ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాల కలిగి ఉన్న ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లలో  విజయవంతంగా ప్రదర్శించబడుతుంది, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ సినిమా దర్శకుడు సాగర్ కే చంద్ర తెలియజేశాడు.  ఇద్దరు స్టార్ హీరోలతో వర్క్ చేయడం యుద్ధం లాంటిది , త్రివిక్రమ్ శ్రీనివాస్ తోడు ఉండడంతో ఈ యుద్ధం సునాయాసం అయిపోయింది.  త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి రచయిత, దర్శకుడి సలహాలూ, సూచనలు ఎవరికైనా అవసరమే, త్రివిక్రమ్ శ్రీనివాస్ లేకపోతే భీమ్లా నాయక్ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు అని సాగర్ కేంద్ర తెలియజేశారు . భీమ్లా నాయక్,  డానియల్ శేఖర్ రెండు కూడా బలమైన పాత్రలే , ఆ రెండు పాత్రలను కూడా స్టార్ హీరోలే పోషించారు,  కాబట్టి తెరపై నువ్వా నేనా అన్నట్టు గా పోటీ సాగింది అని సాగర్ కే కేంద్ర తెలియజేశారు.  ఒరిజినల్ సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాలు భీమ్లా నాయక్ సినిమాలో లేవు,  అవి మన తెలుగు నేటివిటి కి సెట్ కావు, అందుకే ఆ సన్నివేశాలను పక్కన పెట్టవలసి వచ్చింది ఇలా అనేక విషయాలను సాగర్ కే చంద్ర తాజా ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: