పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు  ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'  సినిమా తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు,  ఆ తర్వాత మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వఖిల్ సబ్'  మూవీ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వకీల్ సబ్ సినిమా మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సాధించింది. వకీల్ సబ్ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా కొంత కాలం క్రితమే విడుదల అయ్యింది, భీమ్లా నాయక్ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

 భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'  సినిమాతో పాటే హరిహర వీరమల్లు సినిమాలు కూడా ప్రారంభించాడు. కాకపోతే కొన్ని కారణాల వల్ల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యి నిలిచిపోయింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాను ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తొలి జానపద చిత్రం హరిహర వీరమల్లు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కథ కు అనుగూనంగా మూడు విభిన్నమైన గెటప్ లలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఈ మూవీలో మరో అదిరిపోయే సర్ప్రైజ్ కూడా ఉందట... ఈ మూవీ లో దాదాపుగా 30 రకాల థీమ్ డ్రెస్సులో పవన్ కళ్యాణ్ కనిపించి సర్ ప్రైజ్ చేయనున్నారని హరిహర వీరమల్లు మూవీకి ఇది ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: