ఆడియెన్స్ కి కంటెంట్ ఉన్న సినిమా వస్తే చాలు అది ఎవరి సినిమా అని కూడా చూడరు. ఆ సినిమాలో హీరో ఎవరన్నది అవసరం లేదు. బడ్జెట్ ఎన్ని కోట్లు అన్నది కూడా పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే అది డబ్బింగ్ సినిమానా స్ట్రైట్ సినిమా అని కూడా చూడరు. సినిమా నచ్చిందా హిట్ చేసేస్తారు. ప్రస్తుతం ఇండియా మొత్తం ఒకే ఒక్క సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అదే కార్తికేయ 2. ఈ సినిమా హిందీలో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది.

నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ద్వారకా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సినిమాకు అక్కడ రోజు రోజుకి స్క్రీన్స్ పెరుగుతున్నాయి. మొదటి రోజు 50 స్క్రీన్స్ తో మొదలైన కార్తికేయ 2 ఇప్పుడు 700 పైగా థియేటర్స్ లో ఆడుతుంది.

అంతేకాదు సినిమా అన్నిచోట్ల హౌజ్ ఫుల్ షోస్ తో రన్ అవుతుంది. నిఖిల్ కూడా ఈ రేంజ్ సక్సెస్ ని ఊహించి ఉండడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కంటెంట్ బాగుండి దాన్ని పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తే ఎలాంటి సినిమా అయినా సరే ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటారు. కంటెంట్ బాగున్న సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకులు తమ ఆమోదం తెలుపుతూ వస్తున్నారు. కానీ కంటెంట్ లేకుండా వందల కోట్ల బడ్జెట్ పెట్టినా సరే వర్క్ అవుట్ అవ్వవు. కార్తికేయ 2 విషయంలో మరోసారి ఆ విషయం ప్రూవ్ అయ్యింద్ది. కంటెంట్ ఉన్న సినిమాని ఎవడు ఆపలేడు.. ఆ సినిమానే ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. ఏదో ఒక విధంగా ఎంచుకున్న కంటెంట్ ని పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తే చాలు ఆడియెన్స్ దాన్ని నచ్చితే మాత్రం సినిమా రికార్డులు క్రియేట్ చేసేలా చేస్తారు. కార్తికేయ 2 విషయంలో అదే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: