ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఆయా పార్టీలు  వారి వారి అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈసారి ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలకు మొండి చేయి చూపించినట్టు సమాచారం.పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాలలో  జనరల్ కేటగిరీలో 9 రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్ 12 లో ఆరు బీసీలకు, నాలుగు సీట్లు  రెడ్డిలకు కేటాయించింది. ఇదే తరుణంలో కాంగ్రెస్  మాదిగ సామాజిక వర్గానికి సీట్ల కేటాయింపులో మొండి చేయి చూపించిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో మొత్తం ఎస్సీ వర్గాల్లో 70% మాదిగల జనాభా ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం  మూడు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.  

కానీ అనూహ్యంగా కడియం కావ్యకు ఒక సీటు కేటాయించి మిగతా రెండు సీట్లు మల్లు రవి నాగర్ కర్నూల్,  వంశీకృష్ణ పెద్దపల్లి వంటి మాల సామాజిక వర్గాలకు చెందిన నేతలకే కేటాయింపు చేసింది. జనాభా ప్రాతిపదికన  ఎక్కువ ఉన్నటువంటి మాదిగలకు అన్యాయం చేసిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా మాదిగల తరఫున పోరాడుతూ వస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ  రాష్ట్రంలో మొన్నటి వరకు  దోరల పాలన నడిచింది.  ప్రస్తుతం రెడ్డిల పాలన నడుస్తోంది. ఈ ఇద్దరి పాలనలో  అత్యధిక జనాభా 35 లక్షలు ఉన్నటువంటి మాదిగలకు మాత్రం అన్యాయం జరుగుతుందని కొట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈయన బీజేపీ కి సపోర్ట్ చేస్తూ, బీజేపీ వస్తేనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని తన గళాన్ని వినిపిస్తున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాలను  వివరిస్తూ ఉన్నారు.  అయితే ఇది బీజేపీ కీ కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు.

ఒకవేళ ఈ వ్యూహాలు వర్కౌట్ అయితే మాత్రం పూర్తిస్థాయిలో  మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కమలం వైపు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు కూడా ఈ పార్లమెంటు ఎలక్షన్స్ లో అన్యాయం జరిగింది. వీరు కూడా కాస్త బీజేపీ వైపు మళ్ళితే మాత్రం  రాష్ట్రమంతా పార్లమెంటు స్థానాలలో బీజేపీ కి కలిసివచ్చే కాలం వస్తుందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ఖమ్మం పార్లమెంటు స్థానంలో కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకి టికెట్ వస్తుందని భావించారు.  ఇక్కడ కమ్మ జనాభా ఎక్కువగా ఉంటారు. అది కూడా పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  బంధువు అయినటువంటి  రామసహాయం రఘురాం రెడ్డికే టికెట్ ఖరారు చేసింది. ఈ తరుణంలో కమ్మ సామాజిక వర్గం వారు కూడా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో  రెడ్డి వర్గానికి చెందిన నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని  బీసీ, ఎస్సీ, ఎస్టీలను మరుస్తున్నారని  ఒక ప్రచారం అయితే సాగుతోంది. ఈ అంశం బీజేపీ ఆసరాగా చేసుకుని  తనకు అనుకూలంగా మార్చుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: