అక్కినేని వారసుడు అక్కినేని నాగ చైతన్య నాగార్జున కొడుకుగా నాగేశ్వరావు మానవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారి లాగే మంచి లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అసలు అన్నీ అనుకున్నట్లు జరిగితే బాలకృష్ణకు నాగ చైతన్య అల్లుడు అయ్యేవాడట. తెలుగు సినిమాకు రెండు కళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. అలాగే ఆ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు జరిగేవి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు అందరూ అంటుంటారు. తర్వాత అవి మెల్లగా పోయాయి. ఎన్టీఆర్- ఏఎన్నార్ లాగానే , బాలయ్య- నాగార్జున కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు.పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వారసులుగా వాళ్ళ మధ్య ఎప్పటి నుండో మంచి పరిచయం ఉంది. ఈ క్రమంలో నాగ చైతన్యకు బాలయ్య చిన్న కూతురినిచ్చి వివాహం చేయాలనే ఆలోచన జరిగిందట. ఈ విషయమై బాలయ్య, నాగార్జున మధ్య సంప్రదింపులు కూడా జరిగాయట. ఇరు కుటుంబాల పెద్దలు ఓకే అనుకున్నారట.


అయితే నాగ చైతన్య అప్పుడే బాంబు పేల్చాడట. తాను హీరోయిన్ సమంతను ప్రేమిస్తున్నట్లు, ఆమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడట. నాగ చైతన్యకు నాగార్జున చాలా నచ్చజెప్పి చూశారట.సమంతతో పీకల్లోతు ప్రేమలో ఉన్న నాగ చైతన్య ససేమిరా అనడంతో, చేసేది లేక నాగార్జున వెనక్కి తగ్గారట. అనంతరం బాలయ్య చిన్న కూతురు తేజస్విని వైజాగ్ కి చెందిన శ్రీభరత్ ని వివాహం చేసుకున్నారు. ఒకవేళ సమంత ప్రేమలో చైతూ పడకుంటే ఎంచక్కా తేజస్విని భర్త అయ్యేవాడు. ఇప్పుడు హ్యాపీగా చైతూ ఇద్దరు ముగ్గురు పిల్లల తండ్రి అయ్యేవాడు. తేజస్వినికి 2013 వ సంవత్సరంలో వివాహం జరగ్గా అప్పటికే సమంత ఇంకా చైతూ చాలా డీప్ గా ప్రేమించుకుంటున్నారు. మొదటి చిత్రం ఏమాయ చేశావే నుండే వాళ్ళ మధ్య సీక్రెట్ ఎఫైర్ అనేది ఉంది.కానీ ఆ తరువాత అది ప్రేమగా మారి పెళ్లి దాకా వచ్చి ఆ తరువాత విడాకులు తీసుకునేలా అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: