నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కన్నడ మూవీ కిరిక్ పార్టీ ద్వారా అద్భుతమైన విజయాన్ని మరియు ఫుల్ క్రేజ్ ని సంపాదించు కున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది . అందులో భాగంగా ఛలో మూవీ తో తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇలా తెలుగు లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ తమిళ్ లో  కార్తీ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ మూవీ తో కోలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన బాలీవుడ్ లో కూడా పలు మూవీ లలో నటిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం రష్మిక మందన 'గుడ్ బై' అనే బాలీవుడ్ మూవీ లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ కి వికాస్ బహెల్ దర్శకత్వం వహించగా బిగ్ బి అమితా బచ్చన్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా గుడ్ బై మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. గుడ్ బై మూవీ ని అక్టోబర్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రష్మిక మందన మరియు అమితా బచ్చన్ లు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: