కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందారు శింబు. తాజాగా నటించిన వెందు తానింధదు కాడు. క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మెనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఇందులో హీరోయిన్ గా సిద్ధి నటించడం జరిగింది. రాధికా శరత్ కుమార్ ,అప్పు కుట్టి తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో గ్యాంగ్ స్టార్ గా శింబు అద్భుతమైన నటనను ప్రదర్శించారు. తెలుగులో మాత్రం లైఫ్ ఆఫ్ ముత్తు అనే పేరుతో ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. విడుదలైన యాక్షన్ రామచిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. శింబు కు మానాడు సినిమా తర్వాత అదే స్థాయిలో అంతటి విజయాన్ని అందుకుంది ఈ చిత్రం.


ఇక థియేటర్లో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అయినా  అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 13 నుంచి ఈ సినిమా స్ట్రిమింగ్ కానుంది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ప్రకటన కూడా చేశారు. కాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం. అయితే సోషల్ మీడియా వేదికగా విడుదల తేదీని ప్రకటిస్తూ సదరు సంస్థ తెలుగు వర్షన్ పై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఇక ఈ సినిమాలో శింబు పని కోసం ముంబైకి వచ్చిన ఒక యువకుడిగా కనిపిస్తాడు ఆ తర్వాత గ్యాంగ్ స్టార్ గా ఎలా మారతాడో అన్న కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో కూడా హీరో శింబు కు మంచి క్రేజీ ఉందని చెప్పవచ్చు. తను నటించే సినిమాలు ప్రేక్షకులను బాగానే అలరిస్తూ ఉండేవి..అయితే ఈ మధ్యకాలంలో అంతగా సినిమాలు విడుదల చేయకపోవడంతో తన అవకాస్త తగ్గిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: