టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నాగ చైతన్య తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి శెట్టి ,  నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి బంగార్రాజు మూవీ లో కలిసి నటించారు. బంగార్రాజు మూవీ లో వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.  వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ మూవీ. ఈ మూవీ కి ఇళయ రాజా , యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. 

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో అరవింద స్వామి నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొంత కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ధ్రువ మూవీ లో అరవింద స్వామి ప్రతి నాయకుడి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. మరి నాగ చైతన్య మూవీ లో అరవింద స్వామి ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నాగ చైతన్య కెరీర్ లో 22 వ మూవీ గా తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ లో సీనియర్ స్టార్ హీరోయిన్ అయినటు వంటి ప్రియమణి కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: