హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సల్మాన్ ఖాన్ ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగడం మాత్రమే కాకుండా ,  తన సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది.  

అలాగే ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ , చిరంజీవి తో కలిసి ఒక సాంగ్ కి స్టెప్ లు కూడా వేశారు. చిరంజీవి ,  సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్ లు వేసిన సాంగ్ కి అద్భుతమైన రేంజ్ లో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ లభించింది. గాడ్ ఫాదర్ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,  సత్య దేవ్ , నయన తారమూవీ లో ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కీసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ఒక సాంగ్ లో సల్మాన్ ఖాన్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్టెప్ లు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలబడనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: