సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక  పవన్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలలో బిజీగా ఉన్నారు.ఆంధ్రాలో రాజకీయాల విమర్శలు హద్దులు దాటేస్తున్నాయి.ఇక  రాజకీయ పరమైన విమర్శలను రాజకీయం గా కాకుండా వ్యక్తిగత విమర్శలు వరకు తీసుకొస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం వేరు, సినిమా జీవితం వేరు, రాజకీయం వేరు. వీటిని వేరువేరుగా చూడని వాళ్ళు ఆయన రాజకీయాలలో ఉండగా వ్యక్తిగత సినీ జీవితాన్ని కూడా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు.

ఇకపోతే ఇప్పుడు ఆంధ్రాలో వైసిపి తో పాటు ప్రతిపక్షంగా టీడీపి, జనసేన పార్టీల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో మామూలుగా వార్ జరగడం లేదు.అయితే  ఈ క్రమంలో వైసీపీకి చెందిన కొందరు అభిమానులు ప్రత్యర్థి పార్టీలకు చెప్పిన వారిని టార్గెట్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ వాళ్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా టార్గెట్ చేస్తున్నారు.కాగా  దీంతో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు.ఇక  అక్కడితో ఆగకుండా పవన్ కళ్యాణ్ మూడో భార్య అయినా అన్నా లెజ్నోవా ఆరోగ్యం బాగోలేదని,

సింగపూర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారని,ఆమెను చూడడానికి పవన్ కళ్యాణ్ వెళ్లలేదని, ఆమెతో పవన్ కు గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే  పవన్ కళ్యాణ్ తమ పార్టీపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా వకీల్ సాబ్ సినిమాలో నటించిన అనన్య నాగళ్ళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కు పవన్ ను పెళ్లి చేసుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఏదైనా సినిమా వాళ్లకు అభిమానులు పార్టీలతో సంబంధం లేకుండా ఉంటారు. వీళ్ళ వ్యక్తిగత సినిమా జీవితాలు రాజకీయాలు వేరుగా ఉంటాయి. కాగా వారి వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావద్దు అని పవన్ అభిమానులు కోరుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: