గాడ్ ఫాదర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య..ఈ సినిమా ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ లో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుందని మేకర్స్ గురువారం అధికారికంగా ప్రకటించారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే.. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు..


తాజాగా మెగా, మాస్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి రవితేజ మాస్ ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ డిసెంబర్ 12న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన ప్రీ లుక్ సాలిడ్ గా ఉందనే చెప్పాలి. ఓ చేతిలో మేక పిల్ల.. మరో చేతిలో గొడ్డలితో గ్యాస్ సిలిండర్ ను లాక్కొస్తున్న స్టిన్నింగ్ విజువల్ రివీల్ చేశారు. దీంతో ఈ లో రవితేజ లుక్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తెలుస్తోంది..రవి తేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి..


ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక మరోవైపు.. ఈ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ కోసం మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ శ్రుతి హాసన్ తో పాటు చిత్ర యూనిట్ యూరప్ వెళ్ళింది. అక్కడ వండర్ ఫుల్ లోకేషన్స్ లో రెండు పాటలని చిత్రీకరించనున్నారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగల్ 'బాస్ పార్టీ'.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా మారడంతో మ్యూజికల్ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి.. ఈ సినిమా ఇప్పటికే హిట్ టాక్ ను అందుకుంది..ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: