బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుక్ ఖాన్ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత తాజాగా పఠాన్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి జాన్ అబ్రహం ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని జనవరి 25 వ తేదీన హిందీ , తెలుగు , తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో అదిరిపోయే అప్డేట్ ను కూడా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని మరియు సమయాన్ని ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ ను జనవరి 10 వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఎస్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: