
పఠాన్:
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా.. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం పఠాన్.. ఈ సినిమా జనవరి 25వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో విడుదలవుతున్న ఈ సినిమా ఇప్పటికే బుకింగ్స్ రూపంలో భారీగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం.
హంట్:
సుధీర్ బాబు హీరోగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం హంట్. ఈ సినిమా ఈనెల 26వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
మైఖేల్:
యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న మైఖేల్ సినిమా ఫిబ్రవరి మూడవ తేదీన థియేటర్లలో అలరించబోతోంది దర్శకుడు రంజిత్ జయకోడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు.
బుట్ట బొమ్మ:
అనిక సురేంద్రన్ మొదటిసారి హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్న చిత్రం బుట్ట బొమ్మ. ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
అమిగోస్:
బింబిసారా సినిమా తర్వాత ఫుల్ జోష్ లో ఉన్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు అమిగోస్ చిత్రంతో త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ కానుంది.
సర్ , శాకుంతలం:
ధనుష్ నటించిన సర్ సినిమా అలాగే సమంత నటించిన శాకుంతలం సినిమా రెండూ కూడా ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్లలో పోటీ పడబోతున్నాయి.