చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోలు సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద పోటీపడి ఇద్దరూ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా చూసుకుంటే బాలయ్య వీరసింహారెడ్డి సినిమా కంటే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ముందంజలో ఉందని చెప్పవచ్చు. అయినా కూడా బాలయ్య సినిమా కెరియర్ లోనే వీరసింహారెడ్డి సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేసిందని సమాచారం. ఇకపోతే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన పెద్ద సినిమాల హవా ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వారం నుంచి మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఆ భారీ చిత్రాల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.

పఠాన్:
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా..  షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం పఠాన్.. ఈ సినిమా జనవరి 25వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో విడుదలవుతున్న ఈ సినిమా ఇప్పటికే బుకింగ్స్ రూపంలో భారీగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం.

హంట్:
సుధీర్ బాబు హీరోగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం హంట్. ఈ సినిమా ఈనెల 26వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

మైఖేల్:
యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న మైఖేల్ సినిమా ఫిబ్రవరి మూడవ తేదీన థియేటర్లలో అలరించబోతోంది దర్శకుడు రంజిత్ జయకోడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు.
 
బుట్ట బొమ్మ:
అనిక సురేంద్రన్ మొదటిసారి హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్న చిత్రం బుట్ట బొమ్మ. ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

అమిగోస్:
బింబిసారా సినిమా తర్వాత ఫుల్ జోష్ లో ఉన్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు అమిగోస్ చిత్రంతో త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ కానుంది.

సర్ , శాకుంతలం:
ధనుష్ నటించిన సర్ సినిమా అలాగే సమంత నటించిన శాకుంతలం సినిమా రెండూ కూడా ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్లలో పోటీ పడబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: