అనారోగ్యం నుండి కోలుకుని కొన్ని రోజుల క్రితం ‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ కు వచ్చిన సమంత లుక్ ను చూసినవారు ఆమె షూటింగ్ లలో పాల్గొనడానికి మరికొంత సమయం పడుతుంది అని అంచనాలు వేసారు. అయితే అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ ఆమె ముంబాయ్ లో వరుణ్ థామన్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి సమంత డేట్స్ గురించి ‘ఖుషీ’ టీమ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. విజయ్ దేవరకొండతో ఆమె నటిస్తున్న ఈమూవీతో తిరిగి ఆమెకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పూర్వ వైభవం వస్తుందని ఆమె అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనికితోడు ఈసినిమాకు శివ నిర్వాణ దర్శకుడు కావడంతో ఈమూవీ మరొక ‘మజిలీ’ మూవీగా ఆమెకు పేరు తెచ్చి పెడుతుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.


ఇండస్ట్రీ వర్గాలలో ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం సమంత ‘ఖుషీ’ మూవీ స్క్రిప్ట్ లో మార్పులు చేయమని చెప్పినట్లు టాక్. వాస్తవానికి ముందుగా అనుకున్న ప్రకారం ఈమూవీ కథలో సమంత పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆమె పాత్ర చిన్నది అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆమె పాత్రను ఈమూవీ కథలో పూర్తిగా ఉండే విధంగా మార్చమని దర్శకుడు శివ నిర్వాణ పై సమంత ఒత్తిడి పెడుతున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి.


ఈ వార్తలే నిజం అయితే ఈమూవీ షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి మరో సినిమా వైపు వెళ్ళాలి అని ఆలోచనలు చేస్తున్న విజయ్ దేవరకొండ మాష్టర్ ప్లాన్ కు బ్రేక్ పడినట్లే అనుకోవాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరస ఫ్లాప్ లతో ఉండటంతో ఈమూవీ విజయం అతడి కెరియర్ కు అత్యంత కీలకం. ఇలాంటి పరిస్థితుల మధ్య ‘ఖుషీ’ స్క్రిప్ట్ లో సమంత కోరిన విధంగా మార్పులు చేర్పులు జరిగవలసి వస్తే ఈమూవీ విడుదల కావడానికి మరింత సమయం పట్టే ఆస్కారం ఉంది..మరింత సమాచారం తెలుసుకోండి: