
దీంతో నటుడు సందీప్ కిషన్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడ్డాడో కూడా పలు ఇంటర్వ్యూలలో తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమా ఫ్లాప్ నుంచి ఇప్పుడప్పుడే బయటికి వచ్చేలా కూడా కనిపించలేదు సందీప్ కిషన్ .గత కొంతకాలంగా సరైన హిట్టు లేక సతమతమవుతున్న సమయంలో కచ్చితంగా మైఖేల్ సినిమాతో హిట్ కొడదామని అనుకున్నారు. చివరిగా సందీప్ కిషన్ నేను వీడని నీడను అనే చిత్రంతో బాగానే సక్సెస్ అయ్యారు ఈకా తర్వాత అన్ని సినిమాలు కూడా ప్లాపులనే చవిచూస్తాయి.
ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించినట్లుగా కూడా తెలుస్తోంది. అనసూయ కూడా కీలకమైన పాత్రలో నటించింది. అయినప్పటికీ ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. హీరోయిన్గా దివ్యాంశ కౌశిక్.. నటించింది. ఈమె కేర్ కూడా ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్నది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో అటు సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ కెరియర్ కూడా డేంజర్ జాన్ లో ఉందని చెప్పవచ్చు. మరి తమ తదుపరి చిత్రాలపైన ఫోకస్ పెట్టి రాబోయే రోజుల్లోనైనా సరైన విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి. ప్రస్తుతం సందీప్ కిషన్ ఈ సినిమా ఫ్లాప్ తో చాలా డిప్రెషన్ లో ఉన్నట్లుగా సమాచారం.