మళయాళ భామ హనీ రోజ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా జరుగుతుంది. ఆమె నటించిన వీర సింహా రెడ్డి సినిమా హిట్ అవడంతో ఒక్కసారిగా ఆమె గురించి హాట్ న్యూస్ గా మారింది. సినిమాలో శృతి హాసన్ కన్నా హనీ రోజ్ కే ఎక్కువ క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. వీర సింహా రెడ్డి తర్వాత హనీ రోజ్ కి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఆల్రెడీ 2005లోనే శివాజి నటించిన ఆలయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హనీ రోజ్. కానీ అప్పుడు అమ్మడిని ఎవరు పట్టించుకోలేదు.

మళ్లీ వరుణ్ సందేష్ ఈ వర్షం సాక్షిగా సినిమాలో కూడా నటించింది. అప్పుడు కూడా ఆమెని గుర్తించలేదు. కానీ వీర సింహా రెడ్డిలో బాలయ్య మరదలి పాత్రలో ఆమెకు కరెక్ట్ పాత్ర పడ్డది. ఈ సినిమా చూసిన మేకర్స్ హనీ రోజ్ కి వరుస ఆఫర్లు ఇస్తున్నారట. లేటెస్ట్ గా కోలీవుడ్ నుంచి ఆమెకు క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఆమెని తీసుకోవాలని చూస్తున్నారట. అందులో ఆమె ప్రధాన పాత్ర పోశిస్తుండగా సినిమాలో కొన్ని సీన్స్ బికినీలో కూడా నటించాల్సి ఉందట. అయితే హనీ రోజ్ ఈ టైం లో బికినీ అంటే రిస్క్ అనే వారు ఉన్నారు.

అయితే బడా నిర్మాణ సంస్థ ఫ్యాన్సీ డీల్ కూడా కుదరడంతో హనీ రోజ్ కూడా ఆ ఆఫర్ కి ఓకే చెప్పినట్టు టాక్. వీర సింహా రెడ్డి ఒక్క సినిమాతో హనీ రోజ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. తెలుగు, తమిళ భాషల్లో ఈమధ్య కాలం లో ఏ హీరోయిన్ గురించి ఇంతగా డిస్కషన్స్ జరుగలేదు. సో హనీ రోజ్ కి రానున్న రోజుల్లో మరిన్ని మంచి పాత్రలు వచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఎలాగు ఛాన్స్ లు వస్తున్నాయి కదా అని హనీ రోజ్ కూడా వాటిని ఓకే చేస్తుందని తెలుస్తుంది.మరింత సమాచారం తెలుసుకోండి: