చిరంజీవి  కెరియర్ లో మరిచి పోలేని ఫ్లాప్ ల లిస్టు తయారు చేస్తే అందులో ‘ఆచార్య’ ప్రధమ స్థానంలో ఉంటుంది. గత సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా చిరంజీవికి ఒక పీడ కలలా మారింది. అయితే నాగార్జున త్వరలో మొదులు పెట్టబోతున్న సినిమాకు ‘ఆచార్య’ మూవీ మేకింగ్ టెక్నిక్ ను వాడటం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.



‘ఆచార్య’ మూవీలో ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవిని యంగ్ గా చూపించడం కోసం ఒక టెక్నాలజీని వాడారు. ఆ టెక్నాలజీ బాగానే పనిచేసి చిరంజీవి వింటేజ్ లుక్ లోకి మారిపోయినప్పటికీ ఆసినిమా ఫ్లాప్ గా మారడంతో ఆ లుక్ గురించి చిరంజీవి అభిమానులు కూడ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ టెక్నాలజీని నాగార్జున లేటెస్ట్ మూవీ కోసం వాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


నాగ్ బెజవాడ ప్రసన్న కుమార్ ల కాంబినేషన్ లో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న మూవీ కథలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కోసం ‘ఆచార్య’ మూవీలో వాడిన గ్రాఫిక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1990 ప్రాంతంలో నాగార్జున కెరియర్ మంచి పీక్ లో ఉన్నప్పుడు నటించిన ‘కిల్లర్’ ‘నిర్ణయం’ ‘వారసుడు’ ‘హలో బ్రదర్’ సినిమాలలో అందంగా కనిపించిన అప్పటి నాగార్జున లుక్ ను మళ్ళీ ఇప్పుడు గుర్తుకు చేయడానికి గ్రాఫిక్ సహాయంతో  ఈ వింటేజ్ లుక్ ను డిజైన్ చేస్తున్నారని టాక్.


ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని రఫ్ స్కెచ్ లు కూడా తయారు చేసారట. అయితే ‘ఆచార్య’ మూవీలో క్రియేట్ చేసిన చిరంజీవి వింటేజ్ లుక్ పెద్దగా ఎవరికీ నచ్చలేదు. ఇప్పుడు అలాంటి వింటేజ్ లుక్ ఎంతవరకు నాగార్జున కు నప్పుతుంది అన్న సందేహాలు కూడ ఉన్నాయి. అయితే నాగ్ ఇప్పటికీ మంచి ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తున్న పరిస్థితులలో ఈ ప్రయోగం నాగార్జునకు కలిసి వచ్చే ఆస్కారం ఉంటుంది అన్న అంచనాలు కూడ ఉన్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: