ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందులో భాగంగా పోయిన సంవత్సరం ఈ యువ హీరో సెబాష్టియన్ ... సమ్మతమే ... నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూడు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇలా పోయిన సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన ఈ యువ హీరో ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేసి హిట్ మూవీ గా నిలిచింది. ఇలా ఈ సంవత్సరం ఇప్పటికే వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కిరణ్ "మీటర్" అనే మరో మూవీ తో ప్రేక్షకుల పలకరించడానికి రెడీ అయ్యాడు. 

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ కి సంబంధించిన ఒక పోస్టర్ ను ఈ సినిమా బృందం విడుదల చేయగా దీనికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ యొక్క టీజర్ ను మార్చి 7 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: