తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీచంద్ ఆఖరుగా మారుతీ దర్శకత్వంలో యు వి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన పక్క కమర్షియల్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. రాసి కన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... రావు రమేష్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇలా పక్కా కమర్షియల్ మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందుతున్న రామబాణం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మే 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ... కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం ... లౌక్యం అనే రెండు మూవీ లు తెరకెక్కి భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరి ఇప్పటికే శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందినటు వంటి లక్ష్యం ... లౌక్యం మూవీ లతో సూపర్ సక్సెస్ ను అందుకున్న గోపీచంద్ మరో సారి రామబాణం మూవీ తో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడో లేదో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి గోపీచంద్ కు సంబంధించిన ఒక అదిరిపోయే మాస్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: