తమిళ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కార్తీ ఆఖరుగా పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన సర్దార్ అనే స్పై థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కార్తీ డ్యూయల్ రోల్ లో నటించి  రెండు పాత్రలలో కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు.

ఇది ఇలా ఉంటే సర్దార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఇలా సర్దార్ మూవీ విజయంతో అద్భుతమైన జోష్ లో ఉన్న కార్తీ ప్రస్తుతం జపాన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ డిఫరెంట్ గా ఉండడంతో దినికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ని జూన్ 29 వ తేదీన విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: