‘శాకుంతలం’ సినిమా మొదలుపెట్టే సమయానికి సమంత దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్. అయితే ఈసినిమా పూర్తి అయి విడుదలయ్యే సమయానికి రకరకాల కారణాల రీత్యా సమంత మ్యానియా పూర్తిగా తగ్గిపోయింది. దీనికితోడు ఆమె అనారోగ్య సమస్యలు కూడ ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి.


ఇలాంటి పరిస్థితులలో 70 కోట్ల భారీ బడ్జెట్ తో గుణశేఖర్ చాల కష్టపడి తీసిన ‘శాకుంతలం’ మార్కెటింగ్ సమస్యలు ఎదుర్కుంటోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీకి గాడ్ ఫాదర్ గా దిల్ రాజ్ వ్యవహరిస్తున్నప్పటికీ ఈమూవీ మార్కెటింగ్ కష్టాల నుండి బయటపడలేకపోతోంది అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ ఇప్పటివరకు 30కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది అని అంటున్నారు.


దీనితో ఇంకా 40 కోట్ల లోటు ఈమూవీని వెంటాడుతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ‘శాకుంతలం’ పాన్ ఇండియా మూవీగా మార్కెట్ చేస్తున్నప్పటికీ బాలీవుడ్ మార్కెట్ లో అదేవిధంగా దక్షిణాదిలోని మిగతా భాషల మార్కెట్ లో చెప్పుకోతగ్గ స్థాయిలో క్రేజ్ ఏర్పడక పోవడంతో ఈ మూవీ మార్కెటింగ్ కు సంబంధించి ఈ సమస్యలు ఏర్పడ్డాయి అని అంటున్నారు. దీనికితోడు ఈ మూవీకి ఓటీటీ అదేవిధంగా శాటిలైట్ ఛానల్స్ ఆఫర్లు వస్తున్నప్పటికీ ఆ ఆఫర్ల స్థాయి చాల తక్కువగా ఉంది అన్నప్రచారం కూడ జరుగుతోంది.


ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఈ మూవీ విడుదల అయ్యే ఏప్రియల్ 14న కోలీవుడ్ ‘రుద్రుడు’ ‘బిచ్చగాడు 2’ కూడ విడుదల అవుతున్న పరిస్థితులతో పాటు ఈమూవీ విడుదలైన కొంత గ్యాప్ తో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ 2’ కూడ విడుదల అవుతున్న పరిస్థితులలో ‘శాకుంతలం’ సినిమాకు అన్నివిషయాలలోనూ ఎదురు గాలి వీస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెరియర్ పరంగా మళ్ళీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సమంత నిలదొక్కుకోవాలి అంటే ఈమూవీ ఘన విజయం ఆమెకు చాల అవసరం. ఇలాంటి పరిస్థితులలో సగటు ప్రేక్షకుడు సమంత కెరియర్ కు ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: