విశ్వక్ సేన్ తాజాగా దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించిడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించిన విషయం మన అందరికీ తెలిసింది. నివేత పేతురాజ్ ఈ సినిమాలో విశ్వక్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరూ కలిసి పాగల్ మూవీ లో నటించారు. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మంచి అంచనాలు నడుమ మార్చి 22 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అయింది.

 ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ఈ సినిమాకు ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిందో తెలుసుకుందాం.


రెండు రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమా 1.47 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ,  సీడెడ్ లో 59 లక్షలు ,  యు ఏ లో 53 లక్షలు ,  ఈస్ట్ లో 36 లక్షలు , వెస్ట్ లో 23 లక్షలు , గుంటూరు లో 45 లక్షలు ,  కృష్ణ లో 29 లక్షలు ,  నెల్లూరు లో 19 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 4.11 కోట్ల షేర్ ... 7.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. రెండు రోజుల్లో ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు ,  ఓవర్ సీస్ లో 82 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.53 కోట్ల షేర్ ... 11 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: