తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో సాయి ధరమ్ ఒకరు. ఈ యువ హీరో పిల్ల నువ్వు లేని జీవితం అనే మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ... మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఆ తరువాత వరుసగా సుప్రీమ్ ... సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ లతో పరుస విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా తనకంటూ ఒక అద్భుతమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ యువ హీరో ఆఖరుగా రిపబ్లిక్ అనే మూవీ లో హీరో గా నటించాడు. 

మంచి అంచనాలు నడుము విడుదల అయిన ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ హీరో తాజాగా విరుపాక్ష అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ ... సాయి తేజ్ సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రచారాలను కూడా మొదలు పెట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఈ విషయాన్ని తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ తో సాయి తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటడో చూడాలి.ఇప్పటివరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: