తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరో లలో ఒకరు అయినటువంటి అక్కినేని నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి శెట్టి ... నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించగా ... తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ... అరవింద స్వామి ... ప్రియమణిమూవీ లో కీలక పాత్రలలో నటించారు. 

మూవీ ని మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచింది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేసింది. ఆ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి రెండవ సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది.

మూవీ నుండి "టైం లెస్ లవ్" అంటూ సాగే రెండవ పాటను ఈ నెల 23 వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా నాగ చైతన్యమూవీ లో పోలీస్ పాత్రలో కనిపించనుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: