పోయిన సంవత్సరం సంక్రాంతి కానుక గా విడుదల అయిన రౌడీ బాయ్స్ మూవీ తో ప్రేక్షకు లను పలకరించిన ఆశిష్ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ యువ హీరో రౌడీ బాయ్స్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది . ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది . 

ఇది ఇలా ఉంటే రౌడీ బాయ్స్ మూవీ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ఆశిష్ తాజాగా సెల్ఫిష్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాలో ఆశిష్ సరసన లవ్ టుడే మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఇవానా హీరోయిన్ గా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మూవీ ని సుకుమార్‌ రైటింగ్స్‌ , శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ మూవీ ని ఈ సంవత్సరం ద్వితియార్థంలో విడుదల చేయాలి అని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "దిల్ కుష్" అంటూ సాగే పాటను మే 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పాట ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: