తెలుగు హీరోయిన్లకు తెలుగు సినిమాల్లో అంతగా చాన్సులు రావని వచ్చినా హీరో చెల్లెలు లాంటి చిన్నా చితకా వేషాలు తప్ప కీలక పాత్రలకు వీరిని తీసుకోరు అని వార్తలు వస్తుంటాయి .

అయితే చాలా కాలానికి ఆ పరిస్థితుల్లో మార్పు వస్తున్నట్లుగా తెలుస్తుంది .

ఇప్పుడు ఒక తెలుగు హీరోయిన్ టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకుతుంది అని తెలుస్తుంది.ఆమె మరెవరో కాదు పెళ్లిసందడి సినిమా తో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన శ్రీ లీల .అందంలోనూ అభినయంలోనూ ఫస్ట్ మార్కులు వేయించుకున్న ఈ చిన్నది డాన్సల లో కూడా ఇరగదీస్తుంది.ఇటీవల విడుదలైన ఒక సినిమా లో .రెండు పాటలలో ఈ చిన్నదాని నృత్యానికి తెలుగు యువత ఫిదా అయ్యారని తెలుస్తుంది .కన్నడలో రెండు, తెలుగులో రెండు సినిమాలు చేసిన ఆమె కాల్ సీట్ల కోసం ఇప్పుడు తెలుగులో బడా హీరోల సైతం క్యూలో నుంచునే పరిస్థితి వచ్చిందట .పూజా హెగ్డే, రష్మిక లాంటి టాప్ క్లాస్ భామలను కూడా కాదని ఈమె కోసం ఎదురుచూస్తున్నారంటే ఈమె హవా ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది .ఎంతోమందిని బడా హీరోయిన్లు చేసిన కే రాఘవేంద్రరావు చేతితో లాంచ్ అయిన ఈ తెలుగమ్మాయి మొదటి సినిమా విజయం సాధించకపోయినా తన అందానికి అభినయానికి మాత్రం మంచి మార్కులు వేయించుకుంది.ఆ తర్వాత రవితేజతో నటించిన ఈమె తన డాన్స్ లో కూడా సూపర్ గ్రేస్ ఉన్నదని నిరూపించుకుంది.ఆ సినిమా విజయంతో ఇక వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఆ అమ్మాయికి రాలేదు.మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ,విజయ్ దేవరకొండ, రామ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఆమె సినిమాల లిస్టు చూస్తే అసలు ఇన్ని సినిమాలకు ఆమె డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి .ఇదే జోరు కొనసాగిస్తే టాలీవుడ్ నెంబర్వన్ కిరీటం ఆమెదేనని నిరభ్యంతరంగా చెప్పవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి: