సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే రజనీ కాంత్ ఆఖరుగా పెద్దన్న అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నయన తార ... రజిని సరసన హీరోయిన్ గా నటించగా ... కీర్తి సురేష్మూవీ లో రజనీ కి చెల్లెలు పాత్రలో నటించింది. మీనా , కుష్బూ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇలా పెద్దన్న మూవీ తో ప్రేక్షకులను పెద్దగా అల్లరించలేకపోయిన రజిని ప్రస్తుతం జైలర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. 

మూవీ కి కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు గల దర్శకులలో ఒకరు అయినటు వంటి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... రమ్యకృష్ణ , తమన్నామూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బంధం కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ మూవీ యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏసియన్ సంస్థ దక్కించుకున్నట్లు తాజాగా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండగా ... తెలుగు సినీ ప్రేమికుల్లో ఈ మూవీ పై పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: