ప్రతి వ్యక్తి తాను చేస్తున్న వృత్తిలో ఇమడలేక అసంతృప్తితో కొనసాగుతూనే ఉంటాడు. ఇలా తను చేసే వృత్తి పట్ల అయిష్టత పెంచుకున్న వ్యక్తులు ఎట్టి పరిస్థితులలోను విజయాన్ని అందుకోలేరు. దీనికితోడు ఏవ్యక్తి అయితే నిరంతరం ఎదుటి మనిషిలోని తప్పులు వెతుకుతూ ఆ వ్యక్తితో సంభాషించేడప్పుడు నిందాపూర్వకంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాడో అలాంటి వ్యక్తులు ఎంత సమర్ధులు అయినప్పటికీ ధనవంతులు కాలేరు.


అదేవిధంగా జీవితంలో చేసిన పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకోలేని వ్యక్తులు ఎంత ప్రయత్నించినా ధనవంతులు కాలేరు. ప్రతివ్యక్తి ఎదుగుదలకు ఊహలలో విహరించడం తప్పనిసరి అయినప్పటికీ మితిమీరిన ఊహల్లో ఉండే వ్యక్తులు ఎంత ప్రయత్నించినప్పటికీ అలాంటి వ్యక్తులు ఐశ్వర్య వంతులు కాలేరు. అంతేకాదు ఏదైన ఒక విషయంపట్ల అదేవిధంగా ఒక భౌతిక సంపద పట్ల విపరీతమైన మోజును ఏర్పరుచుకునే వ్యక్తి కూడ ధనవంతుడు కాలేరు.




ముఖ్యంగా ధనాన్ని ఆర్జించాలి అన్న లక్ష్యంతో ముందడుగు వేసే వ్యక్తి ముందుగా తనలో ఉన్న లోపాన్ని గ్రహించగలగాలి. తన లోపాలకు సంబంధించిన పరిష్కారాలు తనకు తాను విశ్లేషించుకున్న వ్యక్తులు మాత్రమే ధనవంతులు కాగలుగుతారు. ఎదుటివాళ్ళ సానుభూతి కోసం తమ కష్టాలను ఎదుటి వాళ్ళు అడిగినా అడగకపోయినా చెప్పుకునే వ్యక్తులు ఎట్టి పరిస్థితులలోను ధనవంతులు కాలేరు. ఇతరులలో మనకు నచ్చని విషయాల గురించి నిరంతరం విశ్లేషణలు చేస్తూ కాలం గడిపే వ్యక్తులు కూడ డబ్బు సంపాదించలేరు.


అదేవిధంగా మన చుట్టూ ఉన్న వ్యక్తులలో మన సన్నిహితులు ఎవ్వరూ మనలను ప్రోత్సహించే వారు ఎవరు అన్న విషయమై స్పష్టమైన క్లారిటీ లేకుండా ప్రతి వ్యక్తితోను గంటల తరబడి మాట్లాడుతూ కాలం గడిపేవారు ఐశ్వర్య వంతులు కాలేరని మనీ విశ్లేషకులు చెపుతున్నారు. మనం చేసే పనిలో పూర్తి స్థాయి నియంత్రణను సాధించి ఫలితం గురించి ఆలోచించకుండా నిరంతరం కష్టపడే మనస్తత్వం ఉన్నవారు మాత్రమే ధనవంతులు కాగలుగుతారు. ఈ విషయాలలో మనం విజయం సాధించాలి అంటే ప్రతి వ్యక్తి తనకు తాను ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే సంపన్నులు కాగలుగుతారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: