ప్రస్తుతం సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖ ద్వారా కొన్ని రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకాలలో చేరిన ఖాతాదారులు మంచి ఆదాయంతో పాటు రెట్టింపు వడ్డీ కూడా పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ , బ్యాంకులలో పొదుపు చేయడం కంటే పోస్టల్ శాఖ తీసుకువచ్చిన ఈ పథకాలలో ఇప్పుడు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మరింత లాభం పొందవచ్చు అని చెప్పవచ్చు. అంతేకాదు పోస్ట్ ఆఫీస్ లో కూడా అధిక వడ్డీ ఇచ్చే స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి మరి వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


సుకన్య సమృద్ధి యోజన పథకం:
కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాదు ఈ పథకం ద్వారా అధిక వడ్డీని కూడా అందిస్తోంది. 10 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న ఆడపిల్లల పేరుపైన ఈ ఖాతా తెరవచ్చు ..ఇక దీని ద్వారా 7.60% వడ్డీ కూడా అందిస్తోంది. ఈ పథకంలో సంవత్సరానికి ₹250 నుండి ₹1.5 లక్షల వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. 15 సంవత్సరాల పాటు ఇలా చేస్తే 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత వడ్డీతో సహా మొత్తం డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్:
15 సంవత్సరాల కాల పరిమితితో ఉన్న ఈ పథకం ద్వారా మీరు 7.10 శాతం వడ్డీని పొందుతారు. ముఖ్యంగా ఈ పథకంలో ₹500 నుండి ₹ 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు తో పాటు మెచ్యూరిటీ తర్వాత వడ్డీతో సహా అసలు కూడా మీరు విత్ డ్రా చేయవచ్చు.


సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం:
ఇందులో 50 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు . ₹1000 నుంచి ₹ 15 లక్షల వరకు గరిష్టంగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు సంవత్సరాల కాలపరిమితితో మీరు ఈ పథకంలో చేరవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: