ఇంట్లో కూర్చుని ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నట్లయితే మీకోసం ఒక చక్కటి శుభవార్త అని చెప్పాలి. ఈరోజు మీకోసం కొన్ని ఉత్తమమైన వ్యాపార ఆలోచన అందిస్తున్నాము. మీ ఇంటి టెర్రస్ పైన కూడా మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే వ్యాపారాలు ఇవి.. ముఖ్యంగా ఈ వ్యాపారాల ద్వారా నష్టపోయే అవకాశం కూడా అసలు లేదని చెప్పవచ్చు. ఇకపోతే ఈ వ్యాపారం ద్వారా ప్రతినెల మీరు సంపాదించవచ్చు. టెర్రస్ ఫార్మింగ్, సోలార్ ప్యానెల్, మొబైల్ టవర్, హోర్డింగ్ లు ఇంటి పై కప్పు పై బ్యానర్లు తదితర పనులు చేసి భారీగా సంపాదించవచ్చు.


మీరు మీ టెర్రస్ ని అద్దెకు ఇవ్వడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఇక చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు ఇటువంటి వ్యాపారాలు ప్రారంభించి భారీ లాభాలను సొంతం చేసుకోవచ్చు. టెర్రస్ వ్యవసాయం అంటే ఇంటి పైకప్పు మీద వ్యవసాయం చేయడం అన్నమాట. మీరు నివసిస్తున్న పెద్ద ఇంటి పై డాబా ఉంటే మీ డాబాపై వ్యవసాయం చేయడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చు. ఇందుకోసం పైకప్పు పై పాలీ బ్యాగులో రకరకాల కూరగాయల మొక్కలను నాటి టెర్రస్ గార్డెనింగ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు.

మీరు మీ ఇంటి పై కప్పు పై సోలార్ ప్లాంట్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా కూడా వ్యాపారం మొదలు పెట్టవచ్చు ఇది మీకు విద్యుత్ బిల్లును ఆధార్ చేయడమే కాదు పెద్ద మొత్తంలో డబ్బును కూడా అందిస్తుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా దీనిని ప్రోత్సహిస్తున్నది కాబట్టి మీరు దీనిని ప్రారంభించి చిన్న పెట్టుబడి పెట్టి లాభం పొందవచ్చు. ఇక ఇంటి పైన కప్పు ఖాళీగా ఉంటే మొబైల్ టవర్ ఇన్స్టాలేషన్ కూడా చేయవచ్చు. దీనికోసం కూడా మీకు స్థానిక మున్సిపాలిటీ అనుమతి పొంది ఇన్స్టాల్ చేసుకుంటే మొబైల్ కంపెనీ వారు నేరుగా డబ్బులను పంపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: