ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అర్హులైన వారికి వైయస్సార్ వాహన మిత్ర పథకంలో భాగంగా ఐదవ విడత డబ్బులను బటన్ నొక్కి వారి ఖాతాలో డబ్బు జమ చేయబోతున్నారు. ఇందుకోసం ఆయన ఈరోజు విజయవాడలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపో దగ్గరలో ఉన్న మినీ స్టేడియం కి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ప్రసంగించి.. అనంతరం బటన్ నొక్కి నిధులు విడుదల చేయబోతున్నారు. ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద నేడు 2,75,931 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరిగా రూ.10వేల చొప్పున సుమారుగా రూ.275.93 కోట్లను విడుదల చేయబోతున్నారు.

 ఇక ఈ డబ్బు బటన్ నొక్కగానే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతుంది. ఈ పథకం కింద అర్హులు ఎవరు అనే విషయానికి వస్తే.. సొంత వాహనం వుండి దానినే ఉపాధిగా నడుపుకుంటున్న ట్యాక్సీ డ్రైవర్లు,  మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు , ఆటోడ్రైవర్లు,  ఎండియు ఆపరేటర్లకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హులు  10వేల రూపాయల చొప్పున పథకం కింద పొందుతున్నారు. ఇకపోతే ఈరోజు ఇచ్చే రూ.275.93 కోట్లను కలిపి మొత్తం ఇప్పటివరకు ప్రభుత్వం ఈ పథకం కింద రూ.1031.89 కోట్లు ఇచ్చినట్లు అవుతుంది. అంటే లబ్ధిదారులు ఈ ఐదు సంవత్సరాల లో ఒక్కొక్కరు రూ.50 వేల రూపాయల చొప్పున లబ్ధిని పొందినట్లు.


ఇకపోతే ఈ డబ్బులు వస్తున్నా కూడా ఖర్చులు బాగా పెరిగిపోవడం వల్ల వాహనాల రిపేర్లకు ఈ డబ్బు ఏ మాత్రం సరిపోవడంలేదని భావించేవారు ప్రభుత్వానికి ఏవైనా సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నట్లయితే 1902 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి మీ సమస్యలను చెప్పవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే ఫలితంగా ప్రభుత్వం లబ్ధిదారుల సమస్యలను తెలుసుకొని ఈ పథకంలో మార్పులు చేసే అవకాశం కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక మీరు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: