ముఖ్యంగా ఏదైనా వ్యాపారం అనగానే ఖాళీ స్థలం కోసం వెతుకుతూ ఉంటారు..అయితే ఇంటి మేడపైన ఉండే కాలి స్థలాన్ని సైతం వ్యాపారం కోసం ఉపయోగించుకుంటే మంచి లాభాలు వస్తాయట. ఇంతకీ బిల్డింగ్ పైన ఖాళీ ప్రదేశాన్ని ఎలాంటి వ్యాపారాలకు ఉపయోగించుకోవచ్చు ఒకసారి తెలుసుకుందాం.. ఈమధ్య ఇంటి ఆవరణలో ఎక్కువగా మొక్కలను నాటుతూ ఉన్నారు ప్రజలు.. అలాగే ఇంటి పైన కూడా కాయగూరలు పండించుకొని అమ్మడం వల్ల కూడా మంచి లాభాలు వస్తాయి. తక్కువ ఆదాయం వస్తుందనుకునేవారు టెర్రస్ మీద డ్రాగన్ ఫ్రూట్ చెట్లను సైతం పెట్టడం వల్ల మంచి ఫలితాలను అందుకోవచ్చు.
మరికొంతపైన ఇంటి మేడపైన చేపల పెంపకాన్ని సైతం పెంపొందిస్తూ ఉన్నారు. మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాలను తీసుకొని కొంతమంది మహిళలు ఇలా మంచి లాభాలను పొందుతున్నట్లు తెలుస్తోంది మరి కొంతమంది కోళ్లు, పావురాలను సైతం పెంచుకుంటూ మంచి లాభాలను ఆర్థిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటే పుట్టగొడుగులను కూడా పెంచుకోవడం చాలా సులువువే.. మెడ పైన చిన్న షెడ్డు వేసుకొని అందులో పుట్టగొడుగుల పెంపకాన్ని చేసినట్లు అయితే మంచి లాభాలు వస్తాయి.
మరి కొంతమంది ఇంటిపైన సెల్ఫోన్ టవర్లను కూడా ఏర్పాటుతో మంచి లాభాలను పొందుతున్నారు ఎటువంటి పెట్టుబడి లేకుండా ఖాళీ స్థలాన్ని సైతం అద్దెకు ఇవ్వడం వల్ల ఇలా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇదే కాకుండా పలు రకాలు కూడా ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి