బిజినెస్ లో సక్సెస్ కావాలి అంటే కచ్చితంగా కష్టపడితేనే జరుగుతుంది.. అందుకు తగ్గ ప్లానింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీ వంటివి చాలా అవసరం అవుతాయి. ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే ఆ బిజినెస్ లాభాలను సైతం అందిస్తుంది. అలాంటి బిజినెస్ లలో పుట్టగొడుగుల బిజినెస్ కూడా ఒకటి.. ఈ బిజినెస్ ఎక్కువగా వివాహాల సీజన్లో ప్రారంభమవుతూ పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరుగుతున్న సందర్భాలలో ఎక్కువగా విందు భోజనాలలో ప్రత్యేకమైన వంటలుగా వీటిని ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.


పలు రకాల సిటీలలో  ప్రాంతాలలో వీటిని మరింత ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇటీవలే ఒక రైతు పుట్టగొడుగులు పెంచుతూ వీటిని విక్రయాలు చేస్తూ భారీగానే లక్షలలో సంపాదన చేస్తున్నట్లు తెలుస్తోంది. అతని పేరు రాజ్ కుమార్ యాదవ్.. ముంబై మార్కెట్ నుంచి ప్రేరణ పొంది పుట్టగొడుగుల వ్యాపారంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యాపారాన్ని ఫోన్ కాల్స్ తోనే హోమ్ డెలివరీ చేస్తూ చాలా చవకైన ధరకే కస్టమర్లకు అందిస్తూ భారీ లాభాలను పొందుతున్నట్లు తెలుస్తోంది. క్రమక్రమంగా తన వ్యాపారాన్ని సైతం పెంచుకుంటూ వెళ్తున్నట్లు సమాచారం.


యాదవ్ రోజుకి 30 నుంచి 40 కిలోల గ్రాముల దిగుబడితో 6 రకాల పుట్టగొడుగులను సైతం ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. నాణ్యత పట్ల కూడా చాలా శ్రద్ధ తీసుకొని ఉండడంతో వ్యాపారంలో అతని కంటూ ఒక ప్రత్యేకత నిలదొక్కుకున్నారు. ఇక తాజాగా పుట్టగొడుగులు వెంటనే డెలివరీ అయ్యేలా వ్యవస్థను రూపొందించారు. ఈ సేవ వల్ల స్థానికులతో పాటు వీటిని వినియోగించే వారిల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నారు. పుట్టగొడుగులలో చాలా రకాలు ఉన్నాయి వీటి ధర సుమారుగా 200 నుంచి ప్రారంభమవుతుంది అయితే రకాన్ని బట్టి ధరలో మార్పులు ఉంటాయట. సాధారణంగా పుట్టగొడుగులను ఇష్టపడేవారు ఈ స్థానికంగా పెరిగిన వాటితో వ్యాపారాన్ని మొదలుపెట్టి అభివృద్ధి చేసుకుంటే మంచి లాభాలే..

మరింత సమాచారం తెలుసుకోండి: