‘రెడ్’ ను ఓటిటిలో విడుదల చెయ్యాలని ప్లాన్ చేశారట. కానీ అందుకు జెమినీ వారు అడ్డుచెబుతున్నట్టు టాక్. విషయం ఏమిటంటే.. ‘రెడ్’ ను కనుక ఓటిటిలో విడుదల చెయ్యాలనుకుంటే శాటిలైట్ రైట్స్ కు అమ్మిన అమౌంట్ తగ్గించి వెనక్కి ఇవ్వాలని కోరిందట. అందుకు ‘రెడ్’ దర్శకనిర్మాతలు ఒప్పుకోలేదు. కావాలంటే నెట్ ఫ్లిక్స్ వాళ్ళతో పాటు నాలుగు రోజులు పోయాక సన్ నెక్స్ట్ లో కూడా ‘రెడ్’ ను పెట్టుకోవచ్చని ఆఫర్ ఇచ్చారట. కానీ ఆ ఆఫర్ ను జెమినీ వారు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. దాంతో ‘రెడ్’ టీం మళ్ళీ డైలమాలో పడినట్టు తెలుస్తుంది.దీనిని బట్టి చూస్తుంటే ‘రెడ్’ ఓటిటి రిలీజ్ లేనట్టేనని స్పష్టమవుతుంది.