డ్రగ్ కేసులో తనకు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న వార్తలను ఆపాలని ప్రసార మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో రకుల్ పిటీషన్ దాఖలు చేశారు. జస్టిస్ నవీన్ చావ్లా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది. రకుల్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని కేంద్రం, ప్రసార భారతి, ప్రెస్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కోరింది.