అక్టోబర్ 11, 1988 లో జన్మించాడు అభిజీత్. ఇతని కుటుంబానికి సంబంధించిన పూర్వీకులు చార్మినార్ నిర్మాణంలో పాలు పంచుకున్నారట.! అప్పట్లో చార్మినార్ గోడలు మరియు నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి అభిజిత్ పూర్వీకులు వలస వచ్చారట. చార్మినార్ నిర్మాణం కోసం.. గుడ్లు పగలగొట్టడం, పచ్చసొనను కాంక్రీట్ మిశ్రమంలో కలపడం వంటి పనులు చేసేవారట.ఇప్పటికీ అభిజిత్ ఫ్యామిలీ అటువంటి నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారని తెలుస్తుంది. అయితే అభిజిత్ మాత్రం సినిమాల పై ఉన్న మక్కువతో ఇండస్ట్రీ వైపు మళ్లినట్టు తెలుస్తుంది. ఇక ‘బిగ్ బాస్4’ లో అభిజీత్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది.