ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో గల మాచర్ల మండలం, కమ్మపల్లి గ్రామానికి చెందిన పి. నాగేశ్వరరావుకి అల్లు అర్జున్ అంటే వీరాభిమానం. ‘గంగోత్రి’ సినిమా నుండి అభిమాని అట. అప్పటి నుండి ఇప్పటివరకు బన్నీని కలవాలని అతడి కోరిక. నాలుగైదుసార్లు ప్రయత్నించినప్పటికీ కుదరలేదనీ, అందుకే తన ఊరి నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టానని నాగేశ్వరరావు చెప్పుకొచ్చాడు. ఈ పాదయాత్ర చూసి అయినా అల్లు అర్జున్ తనను కలవడానికి పిలుస్తారని నాగేశ్వరరావు ఆశిస్తున్నారు. సెప్టెంబర్ 17న మాచర్లలో అతడు బయలుదేరితే… సెప్టెంబర్ 22కి హైదరాబాద్ చేరుకున్నాడు. అల్లు అర్జున్ ను కలిసే క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు. ,మొత్తం మీద అటు ఇటుగా 250 కిలోమీటర్లు అతడు నడిచినట్టు వెల్లడించాడు.