క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప మూవీలో సాయి పల్లవి అల్లు అర్జున్ కి చెల్లెలుగా నటిస్తుందని రూమర్ నడుస్తుంది. కీలకమైన చెల్లి పాత్ర కోసం సాయి పల్లవి అయితే బాగుండని చిత్ర యూనిట్ భావిస్తున్నారని తాజా కథనాల సారాంశం. హీరోయిన్ గా మంచి ఫార్మ్ లో ఉన్న సాయి పల్లవి చెల్లి పాత్ర ఎలా చేస్తుందనే అనుమానం అందరూ వ్యక్తం చేస్తున్నారు.