మంచి పాత్రల్లో నటిస్తున్న సమయంలో… ఒక మ్యాగజైన్‌కు బోల్డ్ ఫొటో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే ప్రశ్నకు కస్తూరి జావాబిస్తూ…” ఇక్కడ నేను ఇవ్వలేదండీ…! అందరూ అనధికారికంగా వేసేసుకున్నారు. అది ఓ అమెరికన్ ప్రాజెక్టు. మాతృత్వానికి వాళ్లు ఇచ్చే మర్యాద వేరు…మనం ఇచ్చే మర్యాద వేరు. ఆ ఫొటోలు లీక్ కావడం పట్ల నేను చాలా బాధ పడ్డాను.ఓ తల్లి బిడ్డకు పాలిచ్చే ఫొటోలను ఇక్కడి జనాలు వేరే విధంగా చూస్తుంటారు. తరువాత అది తప్పని రియలైజ్ అయ్యాను.చాలా మంది మహిళలు నన్ను సపోర్ట్ చేసారు.పల్లెటూరిలో ఉండే మహిళలు కూడా నాకు సపోర్ట్ చేసారు” అంటూ చెప్పుకొచ్చింది.